వాషింగ్టన్ : యూజర్ల ప్రైవేట్/ఎన్క్రిప్టెడ్ మెసేజ్లనువాట్సాప్ చదవగలుగుతుందని ఆరోపిస్తూ అమెరికాలో ఓ దావా దాఖలైంది. ప్రజా వేగులు (విజిల్బ్లోయర్స్) ఈ సమాచారం ఇచ్చినట్లు ఈ దావా పేర్కొంది.
దీంతో వాట్సాప్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ (ఈ2ఈఈ) విశ్వసనీయత మరోసారి చర్చకు వచ్చింది. పేరెంట్ కంపెనీ మెటా ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. ఆస్ట్రేలియా, బ్రెజిల్, భారత్, మెక్సికో, దక్షిణాఫ్రికాలకు చెందినవారు యూఎస్ కోర్ట్లో దావా వేశారు.