పన్నా: వజ్రాల గనిలో 40 గజాల ప్లాట్‌ను లీజుకు తీసుకుని తవ్వకాలు జరిపిన ఇద్దరు స్నేహితులకు అదృష్టం కలిసి వచ్చింది. వారికి రూ.50 లక్షల విలువైన వజ్రం లభించింది. స్నేహితులైన సతీశ్ ఖాతిక్ (24), సాజిద్ మహ్మద్‌లు మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లా సతీశ్పట్టి ప్రాంతంలోని కృష్ణ కల్యాణ్‌పూర్‌లో ఒక వజ్రాల గనిలో కొంత స్థలాన్ని రూ.200కు 20 రోజుల క్రితం మూడు వారాలకు లీజుకు తీసుకున్నారు. అందులో తవ్వకాలు జరుపగా వారికి 15.34 క్యారెట్ల వజ్రం లభ్యమైంది. అది జామ్ క్వాలిటీతో ఉన్న అరుదైన వజ్రంగా అధికారులు గుర్తించారు.