కువైట్ సిటీ: కువైట్ మాజీ ప్రధాని షేక్ సభా ఖాలెద్ అల్-హమద్ అల్ సభాను కొత్త క్రౌన్స్ ప్రిన్స్‌గా ప్రకటిస్తూ ఆ దేశ ఎమిర్(దేశాధిపతి) ప్రకటన చేసినట్టు స్థానిక మీడియా పేర్కొన్నది. 71 ఏండ్ల షేక్ 2011 నుంచి 2019 వరకు గల్ఫ్ విదేశాంగ మంత్రిగా పనిచేశారు.
ఆ తర్వాత 2022 వరకు ప్రధానిగా ఉన్నారు. 83 ఏండ్ల కువైట్ ఎమిర్ షేక్ మెషాల్ అల్-అహ్మద్ అల్ సభా సింహాసనాన్ని అధిష్ఠించి ఆరు నెలలు అయింది. ఇటీవల ఎన్నికలు జరగ్గా ఆరు వారాల్లోనే పార్లమెంటును రద్దు చేశారు. ఇప్పుడు కొత్త క్రౌన్ ప్రిన్స్‌ను ప్రకటించారు.