Kuwait deports | వివిధ దేశాలకు చెందిన 12 వేల మంది ప్రవాసులను గత మూడు నెలల్లో బహిష్కరించినట్లు కువైట్ అధికారులు తెలిపారు. దీంతో వారిని గత ఆగస్టు నుంచి అక్టోబర్ వరకూ వారిని వారి సొంత దేశాలకు పంపివేసినట్లు స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. సుమారు 4,300 మంది ప్రవాసులను (పురుషులు, స్త్రీలు) అక్టోబర్, ఆగస్టులో 7,685 మంది, సెప్టెంబర్ నెలల్లో వారి సొంత దేశాలకు పంపివేసింది కువైట్. నివాస, కార్మిక చట్టాలతోపాటు పలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినందుకు వారిని తిప్పి పంపుతున్నట్లు కువైట్ ప్రకటించింది.
కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో విదేశాల నుంచి వచ్చిన ప్రవాస భారతీయులు చట్టాలను ఉల్లంఘించకుండా విధి విధానాలు రూపొందిస్తుంది. అంతర్గత వ్యవహారాల శాఖ నిబంధనలను ఉల్లంఘించిన వారి జాబితా ఖరారు చేస్తారు. దేశ తొలి డిప్యూటీ ప్రధానమంత్రి, తాత్కాలిక అంతర్గత వ్యవహారాలు- రక్షణశాఖ మంత్రి షేక్ తలాల్ అల్ ఖాలీద్ కఠిన ఆదేశాల మేరకు నిబంధనలు, చట్టాలు ఉల్లంఘించిన వారి బహిష్కరణ ప్రక్రియ నిర్వహిస్తారు.
దీనికి అదనంగా జాతీయస్థాయిలో జనరల్ డిపార్ట్ మెంట్ ఆఫ్ రెసిడెన్సీ ఎఫైర్స్ (General Department of Residency Affairs) భద్రతా వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. రెసిడెన్సీ నిబంధనలను ఉల్లంఘించిన వారిని, పరారీలో ఉన్న వారిని, వాంటెడ్ పర్సన్లను గుర్తించి, వారి బహిష్కరణకు చర్యలు చేపడుతుంది. కువైట్ చట్టాలు, నిబంధనలను ఉల్లంఘించినందుకు బహిష్కరణకు గురైన వారు తిరిగి ఆ దేశంలోకి అనుమతించరు.