పాంగ్యాంగ్, డిసెంబర్ 4: వింత నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. బాంబులు, గన్లపై తనకు ఉన్న అతి ప్రేమను దేశ ప్రజలపై రుద్దుతున్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లలకు బాంబ్, గన్, శాటిలైట్ పేర్లను పెట్టాలని ఆదేశించారు. ఈ ఆదేశాలను పట్టించుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇదే సమయంలో ఇప్పటికే పెట్టిన పేర్లను కూడా మార్చాలంటూ తల్లిదండ్రులపై అధికారులు ఒత్తిడి చేస్తున్నారు.