మిన్నియాపోలీస్: అమెరికాలోని మిన్నియాపోలీస్‌లో ఉన్న ఎనన్సియేషన్ క్యాథలిక్ స్కూల్లో కాల్పుల ఘటన జరిగింది. రాబిన్ వెస్ట్మ్యాన్ అనే 23 ఏళ్ల వ్యక్తి కాల్పులకు తెగించాడు. స్కూల్ పిల్లలపై అతను కాల్పులు జరిపాడు. అతని వద్ద ఉన్న గన్స్‌పై కిల్ డోనాల్డ్ ట్రంప్(Kill Donald Trump), న్యూక్ ఇండియా అని రాసి ఉన్నది. యూట్యూబ్ ఛానల్లో ఉన్న ఓ వీడియోను ప్రస్తుతం డిలీట్ చేశారు. షూటర్ రాబిన్ మొత్తం మూడు ఆయుధాలతో స్కూల్లోకి ప్రవేశించాడు. ఓ రైఫిల్, ఓ షాట్‌గన్, ఓ పిస్తోల్ అతని వద్ద ఉన్నాయి. డజన్ల కొద్ది రౌండ్లు అతను ఫైరింగ్ చేశాడు. చివరకు స్కూల్ పార్కింగ్ లాట్లో వెస్ట్మ్యాన్ శవమై కనిపించాడు.
కోర్టు రికార్డుల ప్రకారం 2020లో వెస్ట్మ్యాన్ అనే పేరును అతను మార్చుకున్నాడు. ఎందుకంటే వెస్ట్మ్యాన్ అనే పదం ఆడవాళ్లను సూచిస్తున్నట్లు ఉందన్నారు. రాబిన్ డబ్ల్యూ అనే యూట్యూబ్ ఛానల్‌ను అతను నడిపిస్తున్నాడు. పది నిమిషాలు ఉన్న ఓ వీడియోలో అతను తన వద్ద ఉన్న ఆయుధాలను ప్రదర్శించాడు. లోడైన మ్యాగ్జిన్లు ఉన్నాయి. కిల్ డోనాల్డ్ ట్రంప్.. కిల్ ట్రంప్ నౌ, ఇజ్రాయిల్ మస్ట్ ఫాల్, బర్న్ ఇజ్రాయిల్ అని ఆ మ్యాగ్జిన్లపై రాసి ఉన్నది. న్యూక్ ఇండియా అని కూడా ఓ ఆయుధంపై రాసి ఉన్నది. వేర్ ఈజ్ యువర్ గాడ్, ఫర్ ద చిల్డ్రన్ అని కూడా రాశాడు.
రెండో వీడియో 20 నిమిషాల పాటు ఉంది. వేర్వేరు జర్నల్స్‌కు చెందిన సమాచారం దాంట్లో ఉన్నది. సిరిల్లిక్ భాషలో అది రాసినట్లు గుర్తించారు.