ఇస్లామాబాద్, నవంబర్ 11: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో శక్తివంతమైన బాంబు పేలుడులో 12 మంది మరణించగా, 27 మంది గాయపడ్డారు. కోర్టు కాంప్లెక్స్‌లో మంగళవారం మధ్యాహ్నం 12.39 గంటలకు పార్కు చేసి ఉన్న కారులో బాంబు పేలుడు సంభవించింది. ఇది ఆత్మాహుతి దాడని పాకిస్థాన్ మంత్రి మోహిసిన్ నఖ్వీ తెలిపారు. కారు బాంబరు కోర్టు భవనం కాంప్లెక్స్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించి, కుదరకపోవడంతో భవనం బయట ఉన్న వాహనం వద్ద 10-15నిమిషాలు ఎదురుచూసి ఈ పేలుడు కు పాల్పడ్డాడని, విస్ఫోటంతో భవనం బయట ఉన్న వాహనాలు దెబ్బతిన్నాయని చెప్పారు.