లండన్, నవంబర్ 11: కెనడియన్-హంగేరియన్-బ్రిటిష్ రచయిత డేవిడ్ సలైకు ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ వరించింది. ఆయర రచించిన ఫ్లెష్ అనే నవలకు ఈ పురస్కారం దక్కింది. సుదీర్ఘంగా సాగే ఓ సాధారణ వ్యక్తి జీవిత గాథే దీని వృత్తాంతం. ప్రముఖ రచయితలు ఆండ్రూ మిల్లర్, కిరణ్ దేశాయ్‌లు ఫైనలిస్టుగా నిలిచిన ఈ పోటీలో 51 ఏండ్ల సలై వారందరినీ తోసిరాజని ఈ బహుమతిని గెల్చుకున్నారు. ఈ బహుమతి కింద ఆయనకు 50 వేల పౌండ్లు (సుమారు రూ.5.5 కోట్లు) లభిస్తుంది. షార్ట్‌లిస్ట్ రచయితలకు 2,500 పౌండ్లు అందజేస్తారు.