Hindu Temple | కెనడా (Canada)లో ఖలిస్థానీల దాడులు ఆగడం లేదు. గత కొంతకాలంగా ఆ దేశంలోని హిందూ ఆలయాలే (Hindu Temples) లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా సుర్రే (Surrey)లోని శ్రీ లక్ష్మీ నారాయణ ఆలయం (Laxmi Narayan Temple)పై సిక్కు వేర్పాటువాదులు దాడులు చేశారు (vandalise).
ఏప్రిల్ 19న ఖలిస్థానీ జెండాలతో నినాదాలు చేస్తూ ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు విధ్వంసం సృష్టించారు. స్తంభాలు, ద్వారాలపై ఖలిస్థానీ అనుకూల రాతలు రాశారు. వీరి దాడిలో ఆలయ ప్రవేశ ద్వారం, స్తంభాలు ధ్వంసమైనట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల మనోభావాలు దెబ్బతినే ఇటువంటి ద్వేషపూరిత చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
🚨 We strongly condemn the vandalism of Laxmi Narayan Mandir in BC by Khalistani extremists.
This act of #Hinduphobia has no place in Canada.
We urge swift action & ask all Canadians to stand united against hate.
🛑 Silence is not an option.#CHCC #StopHinduphobia pic.twitter.com/flL0Or6Ezc
— Canadian Hindu Chamber of Commerce (@chcconline) April 20, 2025
Also Read..
PM Modi | భారతీయుల పట్ల ఆయనకున్న ప్రేమ ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది.. పోప్ మృతికి ప్రధాని సంతాపం
Pope Francis | క్యాథలిక్ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత