వాటికన్: రోమన్ క్యాథలిక్ క్రైస్తవ మత పెద్ద పోప్ ఫ్రాన్సిస్(Pope Francis) కన్నుమూసినట్లు ఇవాళ వాటికన్ అధికారులు ప్రకటించారు. పోప్ ఫ్రానిస్ అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగిలో. అర్జెంటీనాలోని బూనోస్ ఏరిస్‌లో 1936, డిసెంబర్ 17వ తేదీన ఆయన జన్మించారు. అయిదుగురి సంతానంలో ఆయన పెద్దవాడు. ఫ్రాన్సిస్ తల్లితండ్రులు ఇటలీ దేశస్థులు. అయితే ఫాసిజాన్ని తట్టుకోలేక ఆయన పేరెంట్స్ దక్షిణ అమెరికాకు వలసవెళ్లారు.
ట్యాంగో డ్యాన్సింగ్ అంటే ఆయనకు ఇష్టం. ఆ డ్యాన్స్‌ను ఆయన చాలా ఎంజాయ్ చేసేవాడు. స్థానిక ఫుట్‌బాల్ జట్టుకు మద్దతు ఇచ్చేవాడు. సాన్ లొరెంజో క్లబ్‌కు ఆయన సపోర్టు ఇచ్చారు. చిన్నతనంలోనే ఫ్రాన్సిస్‌కు న్యూమోనియా అటాక్ అయ్యింది. ఆ వ్యాధి ప్రాణాపాయ స్థితి నుంచి ఆయన బయటపడ్డారు. సర్జరీ చేసిన ఫ్రాన్సిస్ శ్వాసకోసకు చెందిన కొంత భాగాన్ని తీసివేశారు. దీని వల్ల జీవితం అంతా ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదంలో ఆయన ఉండిపోయారు.
చర్చిలోకి రాకముందు బెర్గోగిలో ఓ నైట్‌క్లబ్ బౌన్సర్‌గా చేశారు. ఫ్లోర్ స్వీపర్‌గా కూడా పనిచేశారు. కెమిస్ట్‌గా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. బ్యూనస్ ఏరిస్‌లోని ఓ ఫ్యాక్టరీలో ఈస్తర్ బలెస్ట్రినో అనే వ్యక్తితో కలిసి పనిచేశారు. అర్జెంటీనాలో సైనిక నియంతృత్వ పాలకు వ్యతిరేకంగా ఈస్తర్ పోరాడారు. ఆయన ఆమెను టార్చర్ చేసి చంపారు. ఆమె శవాన్ని ఎప్పటికీ గుర్తించలేకపోయారు.
ఫ్రాన్సిస్ ఓ జీసైట్గా మారారు. తత్వశాస్త్రాన్ని చదివారు. సాహిత్యం, సైకాలజీలో ఆయన పాఠాలు బోధించారు. అయితే ఓ దశాబ్ధ కాలం తర్వాత ఆయన తన కేరీర్లో అకస్మాత్తుగా ప్రమోషన్ కొట్టేశారు. 1973లో అర్జెంటీనాలో ప్రావిన్షియల్ సూపీరియర్ అయ్యారు. 1960 దశకంలో ఆయన క్యాథలిక్ పూజారిగా చేశారు. 1998లో బ్యూనస్ ఏరిస్ ఆర్చ్‌బిషప్ అయ్యారు. 2001లో రెండవ పోప్ జాన్ పౌల్ .. ఫాన్సిస్ను కార్డినల్‌గా ప్రకటించారు.