ఇస్లామాబాద్: పాక్, అఫ్ఘానిస్థాన్ యుద్ధంతో పాక్‌లో టమాటా ధరలు చుక్కలనంటాయి.అక్కడ కిలో టమాటాల ధర ఏకంగా రూ.600కు చేరుకుందని రాయిటర్స్ సంస్థ తెలిపింది. ఇది సాధారణ ధర కన్నా ఐదు రెట్లు అధికం. తన జీవితంలో టమాటాలు ఇంత ధర పలకడం ఎన్నడూ చూడలేదని షాన్ అనే వినియోగదారుడు వాపోయాడు.
ఇరు దేశాల మధ్య ఇటీవల జరిగిన యుద్ధం కారణంగా సరిహద్దులను మూసివేశారు. ఈ నెలలో రెండు దేశాల మధ్య జరిగిన దాడుల్లో ఇరు పక్షాల వారు మృతి చెందారు. దీంతో ఆఫ్ఘాన్‌తో వాణిజ్యం జరిపే అన్ని రహదారులు, సరిహద్దులను పాకిస్థాన్ మూసివేసింది.