రష్యాకు బైడెన్ షాక్
ఉక్రెయిన్‌పై దాడులు చేస్తున్న రష్యాపై అమెరికా ఆంక్షల తీవ్రతను పెంచింది. రష్యా నుంచి దిగుమతి చేసుకొంటున్న ముడి చమురుపై నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం శ్వేతసౌధంలో మాట్లాడారు. ‘రష్యా నుంచి ముడి చమురు, గ్యాస్, ఎనర్జీ దిగుమతులపై నిషేధం విధిస్తున్నాం’ అన్నారు. రష్యా నుంచి దిగుమతులు ఆగిపోతే ఆ దేశానికి నిధుల కొరత ఏర్పడుతుందని పేర్కొన్నారు.
- చమురు దిగుమతులపై నిషేధం
- నిధుల కొరత సృష్టించడమే లక్ష్యం
- గ్యాస్ పైప్‌లైన్ మూసేస్తామంటూ ఐరోపా దేశాలకు రష్యా వార్నింగ్
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై దాడులు చేస్తున్న రష్యాపై అమెరికా ఆంక్షల తీవ్రతను పెంచింది. రష్యా నుంచి దిగుమతి చేసుకొంటున్న ముడి చమురుపై నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం శ్వేతసౌధంలో మాట్లాడారు. ‘రష్యా నుంచి ముడి చమురు, గ్యాస్, ఎనర్జీ దిగుమతులపై నిషేధం విధిస్తున్నాం’ అన్నారు. రష్యా నుంచి దిగుమతులు ఆగిపోతే ఆ దేశానికి నిధుల కొరత ఏర్పడుతుందని పేర్కొన్నారు. తమతో పోలిస్తే ఐరోపా దేశాలు రష్యా చమురు ఉత్పత్తులపై ఎక్కువగా ఆధారపడ్డాయని పేర్కొన్న బైడెన్.. తాజా ఆంక్షల విషయంలో ఆయా దేశాలు తమతో కలిసి రాకపోయినా అర్థం చేసుకొంటామన్నారు. రష్యాను ఆర్థికంగా దెబ్బతీయాలంటే చమురు దిగుమతులపై ఆంక్షలు విధించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికాను అభ్యర్థించారు. ఈ క్రమంలోనే బైడెన్ ఈ నిర్ణయం తీసుకొన్నారు.
నార్డ్ స్ట్రీమ్ 1 పైప్‌లైన్ మూసేస్తాం
ఉక్రెయిన్ అంశంలో తమపై ఆంక్షలు విధించిన పశ్చిమ దేశాలపై రష్యా బెదిరింపులకు దిగింది. నార్డ్ స్ట్రీమ్ 1 పైప్‌లైన్ ద్వారా ఐరోపా దేశాలకు సరఫరా చేస్తున్న సహజవాయువును నిలిపేస్తామని హెచ్చరించింది. ఐరోపా దేశాలకు 40 శాతం సహజవాయువు రష్యా నుంచే దిగుమతి అవుతున్నది. యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే సహజవాయువు ధరలు 42 శాతం వరకు పెరిగాయి. ఈ క్రమంలో నార్డ్ స్ట్రీమ్ 1 పైప్‌లైన్‌ను రష్యా ఒకవేళ మూసివేస్తే ఐరోపాతో పాటు, అమెరికాలో కూడా గ్యాస్ ధరలు మరింత పెరుగవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

