అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తాజాగా చేసిన కామెంట్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి. పలువురు నెటిజన్లు బైడెన్‌ను ఛీ కొడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలో నేషనల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్‌కు సంబంధించిన ఒక కార్యక్రమంలో బైడెన్ ఇటీవల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తున్న ఆయన అక్కడ ఉన్న ఒక మహిళను గుర్తించారు. ఆమె గురించి చెప్తూ.. ‘మా ఇద్దరి స్నేహం చాలా కాలం నాటిది. అప్పట్లో తన వయసు 12, నా వయసు 30. కానీ ఎన్నో పనులు చేయడంలో ఆమె నాకు సహాయం చేసింది’ అని బైడెన్ చెప్పారు.
ఈ మాటలు విన్న చుట్టుపక్కల ఉన్న టీచర్లంతా పకపకా నవ్వారు. దీన్ని షేర్ చేసిన కొందరు నెటిజన్లు ‘బైడెన్ ఏం మాట్లాడుతున్నాడో వీళ్లకు అర్థం కావడం లేదా? నవ్వుతున్నారేంటి?’ అని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో బైడెన్‌కు సపోర్ట్ ఇస్తున్న మరికొందరేమో ‘ఆమె వయసు 30, నా వయసు 12 అని చెప్పబోయి నాలుక మడతపడిందంతే’ అని అంటున్నారు. ఏదేమైనా బైడెన్ వ్యాఖ్యలు చాలా మందిని డిస్టర్బ్ చేస్తున్నాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
Biden: “She was 12 I was 30.”
D.C. Crowd: haahahahahaha
And Democrats call Republicans brainwashed?
pic.twitter.com/wB2EKHREg6— Charles R Downs (@TheCharlesDowns) September 23, 2022