Joe Biden | చనిపోయిన వారిపైనా? అంటూ.. రష్యా ఆంక్షలపై అమెరికా నేత సెటైర్లు
ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా దేశ నేతలు, పలువరు వ్యాపారవేత్తలపై పశ్చిమ దేశాలు పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అమెరికా ఆంక్షలు విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రష్యా.. ప్రతిగా అమెరికాలోని పలువురు నేతలపై ఆంక్షలు విధించింది. ఈ నేతలెవరూ రష్యా భూభాగంలో అడుగు పెట్టకూడదని తేల్చిచెప్పింది.
ఈ జాబితాలో జో బైడెన్ (సీనియర్) అని ఉండటాన్ని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి ఎత్తి చూపారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ (జూనియర్) అని, చనిపోయిన ఆయన తండ్రిపై రష్యా ఆంక్షలు విధించిందని ఎద్దేవా చేసిన ఆమె.. జోబైడెన్ (సీనియర్) ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. బైడెన్‌తోపాటు ఆమెపై కూడా రష్యా ఆంక్షలు విధించింది.
ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ఏం పర్లేదు.. ఎందుకంటే మేం ఎవరమూ కూడా రష్యా లేదంటే సైబీరియా టూర్‌కు వెళ్లాలని ప్లాన్ వేసుకోలేదు’’ అంటూ జోక్ చేశారామె. వీళ్లతోపాటు అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంథనీ బ్లింకెన్, డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్, సీఐఏ డైరెక్టర్ విలియం బర్న్స్‌పై కూడా ఆంక్షలు విధించింది రష్యా.
అంతేకాదు, మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిలరీ క్లింటన్‌పై కూడా ఆంక్షలు విధించింది. దీనిపై స్పందించిన ఆమె.. ‘‘ఈ జీవితకాల సాఫల్య పురస్కారం అందించినందుకు రష్యా అకాడమీకి ధన్యవాదాలు’’ అంటూ ట్వీట్ చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

