JD Vance | అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల్లో (America Election) రిపబ్లికన్లు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. కాగా తెలుగింటికి చెందిన అల్లుడు జేడీ వాన్స్ (JD Vance ) అమెరికాకు ఉపాధ్యక్షుడిగా (Vice President) ఎన్నికయ్యారు.
ఈ నేపథ్యంలో కాబోయే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇండియన్ ఫ్యామిలీ (Indian family)తో ఉన్న ఓ గ్రూప్ ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. తన భార్య తరఫు బంధువులతో, భుజాలపై కొడుకును కూర్చో బెట్టుకుని వాన్స్ నిలబడ్డారు. గతవారం అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ డే సందర్భంగా ఈ ఫొటో దిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పిక్ విశేషంగా ఆకట్టుకుంటోంది.
కాగా, జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్ (Usha Vance) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కృష్ణా జిల్లాకు చెందిన వారు కావడం విశేషం. ఉషా చిలుకూరి తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి దంపతులు 1980లో అమెరికాకు వలస వెళ్లారు. వీరి ముగ్గురు సంతానంలో ఉషా ఒకరు. జేడీ వాన్స్ ఒహాయో రాష్ట్ర సెనేటర్‌గా, అమెరికా ఉపాధ్య అభ్యర్థిగా ట్రంప్ ఎంపిక చేసుకుని ఎన్నికల్లో పోటీ చేశారు.
చదువుకునే రోజుల్లోనే స్కూల్లో ఉషాకు పరిచయమైన వాన్స్ ఒకరినొకరు ప్రేమించుకుని 2014లో హిందూ సంప్రదాయం ప్రకారం కెంటకీలో వివాహం చేసుకున్నారు. ఉషా యేల్ యూనివర్సిటీ నుంచి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీ, కేంబ్రిడ్జి వర్సిటీ నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశారు.
Also Read..
Donald Trump | అప్పటిలోపు వారిని విడుదల చేయకపోతే.. హమాస్‌కు ట్రంప్ సీరియస్ వార్నింగ్
Rs 2,000 Notes | ఇంకా ప్రజల వద్దే రూ.6,839 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు : ఆర్బీఐ
Donald Trump | పశ్చిమాసియా వ్యవహారాల సలహాదారుగా.. వియ్యంకుడికి ట్రంప్ కీలక పదవి