వాషింగ్టన్: ఇరాన్‌తో సీజ్ఫైర్(Ceasefire)ను పొడిగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో జరగాల్సిన శాంతి చర్చలు రద్దు అయ్యాయి. ఇక అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా తన పాక్ పర్యటన రద్దు చేసుకున్నట్లు వైట్‌హౌజ్ ద్రువీకరించింది. ఈనెలలో రెండోసారి జేడీ వాన్స్ పాక్‌లో పర్యటించాల్సి ఉంది. ఇరానీ ప్రతినిధులతో ఓ డీల్ కుదుర్చుకునేందుకు ఆ ట్రిప్ జరగాల్సి ఉంది. కానీ కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో వాన్స్ జర్నీ నిలిపివేశారు. అయితే ఒకవేళ వ్యక్తిగత సమావేశాలు ఏమైనా ఉంటే దానిపై ప్రకటన చేస్తామని వైట్‌హౌజ్ అధికారులు చెప్పారు.
ఇరాన్‌తో సీజ్‌ఫైర్‌ను నిరవధికంగా పొడిగించడం పట్ల ట్రంప్‌కు థ్యాంక్స్ చెప్పారు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. మా రిక్వెస్ట్‌ను ఆమోదించి సీజ్ఫైర్ ప్రకటించడం సంతోషకరమని, దీని వల్ల దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతుంటాయని అన్నారు. పాకిస్థాన్‌పై విశ్వాసాన్ని, నమ్మకాన్ని ప్రదర్శించారని, ఇరాన్‌తో సమస్యను పరిష్కరించేందుకు దౌత్యపరంగా తమ ప్రయత్నాన్ని వీడబోమన్నారు. ఇరు దేశాలు సీజ్‌ఫైర్‌ను కొనసాగిస్తూ సమగ్రమైన శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంటాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.
ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ కూడా ట్రంప్ నిర్ణయాన్ని స్వాగతించారు. ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇది కీలకమైన అడుగు అని, దీని ద్వార దౌత్యం నిర్వహించేందుకు మార్గం సులువు అవుతుందని, అమెరికా-ఇరాన్ మధ్య విశ్వాసం పెరుగుతుందని సెక్రటరీ జనరల్ ప్రతినిధి స్టీఫానే డుజారిక్ తెలిపారు. సీజ్‌ఫైర్‌ను ఉల్లంఘించకుండా, నిర్మాణాత్మకంగా చర్చలు నిర్వహించాలన్నారు. శాంతి చర్చల అంశంలో పాక్ ఇచ్చిన మద్దతును ఆయన ప్రశంసించారు.