న్యూఢిల్లీ: జపాన్‌లో ఇప్పుడు ఇంటర్నెట్(Japan Internet) రికార్డు సృష్టించింది. ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ను ఆ దేశం రూపొందించింది. ఒక సెకనుకు 1.02 పెటాబిట్స్ వేగంతో పనిచేసే ఇంటర్నెట్ సేవల్ని కనుగొన్నారు. ఆ వేగంతో కేవలం సెకనులోనే నెట్‌ఫ్లిక్స్ లైబ్రరీలో ఉన్న వీడియోలను డౌన్లోడ్ చేయవచ్చు అని పరిశోధకులు చెబుతున్నారు. భారత్‌తో పోలిస్తే జపాన్‌లో బ్రౌజింగ్, డౌన్లోడింగ్ స్పీడ్ 16 మిలియన్ల సార్లు ఎక్కువ అని తెలిసింది. ఇండియాలో సగటు ఇంటర్నెట్ స్పీడ్ 63.55 ఎంబీపీఎస్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ ప్రకారం అమెరికాలో ఇంటర్నెట్ మూడు రెట్లు అదిక వేగంతో పనిచేస్తుంది.
జపాన్ ఎన్ఐసీటీతో కలిసి పనిచేస్తున్న ఫోటోనిక్ నెట్వర్క్ ల్యాబ్ టీమ్‌తో పాటు సుమితోమా ఎలక్ట్రిక్, యురోపియన్ పార్ట్నర్స్ కొత్త తరహా టెక్నాలజీని రూపొందించారు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన నెట్‌వర్క్‌గా భావిస్తున్నారు. సుమారు 1808 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యానికి డేటాను కేవలం సెకనులో పంపిస్తున్నారు. 19 కోర్స్ ఉన్న స్పెషల్ ఆప్టిక్ కేబుల్ ద్వారా ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది.
కొత్త ఇంటర్నెట్ స్పీడ్‌తో జపాన్‌లో .. ఇంగ్లీష్ వికీపిడియాను 10వేల సార్లు కేవలం ఒక్క సెకనులోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ వికీపిడియాసుమారు 100 జీబీ స్పేస్ వాడుతుంది. కావాలనుకుంటే 8కే వీడియోలను కేవలం సెకనులో మాత్రమే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ కోసం వాడే ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌ను సుమిటోమో ఎలక్ట్రిక్ సంస్థ డిజైన్ చేసింది. ఎన్ఐసీటీ దానికి కావాల్ఇసన ట్రాన్స్మిషన్ సిస్టమ్ణు నిర్మించింది.
ప్రతి 86.1 కిలోమీటరు దూరానికి ట్రాన్స్మిటర్లు, సిరీవర్లు, 19 లూపింగ్ సర్క్యూట్లను ఎన్ఐసీటీ పరిశోధకులు వాడారు. ఈ లూప్స్ ద్వారా సిగ్నల్స్ 21 సార్లు పాస్ అయ్యాయి. మొత్తం 1808 కిలోమీ దూరాన్ని .. రికార్డు బ్రేకింగ్ స్పీడ్‌తో 180 డేటా స్ట్రీమ్స్ తీసుకెళ్లినట్లు గుర్తించారు.