టోక్యో: జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై (Shinzo Abe) హత్యాయత్నం జరిగింది. పశ్చిమ జపాన్‌లోని నారా నగరంలో జరిగిన ఓ సమావేశంలో షింజో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేజ్‌పై మాట్లాడుతుండగా దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. దీంతో షింజో వేధికపై కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను సమీపంలోని దవాఖానకు తరలించారు. కాగా, తుపాకీ కాల్పుల శబ్ధం వినిపించిందని, ఆయనకు తీవ్రగాయం అయిందని జపాన్‌కు మీడియా పేర్కొన్నది. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జపాన్ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా షింజో అబే రికార్డు సృష్టించారు. 2006లో ఆయన తొలిసారిగా జపాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అయితే అనారోగ్యంతో 2007లో తన పదవికి రాజీనామా చేశారు. 2012లో మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2020 వరకు పదవిలో కొనసాగారు. అదే ఏడాది ఆగస్టులో అనారోగ్య కారణలతో ఏడాది ముందుగానే ప్రధాని పదవికి రాజీనామా చేశారు.
కాగా, షింజో అబేకు భారత్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. 2006-07లో తొలిసారిగా భారత పర్యటనకు వచ్చిన సమయంలో పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. 2014 జనవరి, 2015 డిసెంబర్, 2017 సెప్టెంబర్‌లో దేశంలో పర్యటించారు. ఒక జపాన్ ప్రధాని ఇండియాలో ఇన్నిసార్లు పర్యటించడం అదే మొదటిసారి.
WATCH: Bystanders rush to help former Japanese Prime Minister Shinzo Abe after he is shotpic.twitter.com/vgk7fn323p
— BNO News (@BNONews) July 8, 2022