టోక్యో, డిసెంబర్ 11: అంతరిక్ష ప్రయోగాల్లో జపాన్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఆ దేశానికి చెందిన ఐస్పేస్ అనే అంతరిక్ష ప్రయోగాల స్టార్టప్.. చంద్రుడిపైకి వాణిజ్య వ్యోమనౌకను విజయవంతంగా పంపించింది.
ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ సాయంతో హాకుమో-ఆర్ఎం1 అనే వ్యోమనౌకను పంపింది. చంద్రుడిపైకి వాణిజ్య వ్యోమనౌకను పంపిన తొలి ప్రైవేట్ సంస్థగా ఐస్పేస్ రికార్డు సృష్టించింది.