న్యూఢిల్లీ, జూలై 8 : నిషిద్ధ ఉగ్రవాద గ్రూపు జైషే మొహమ్మద్(జేఈఎం) చీఫ్ మసూద్ అజర్‌ను పాకిస్థాన్ మళ్లీ భారత వ్యతిరేక ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడానికి రంగంలోకి దింపింది. ఇటీవల పాక్‌లోని ఓ మసీదులో వినిపించిన ఆడియో టేపులో మసూద్ అజర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇతరుల వద్ద సర్వం ఉండవచ్చనీ కాని తమ మద్ద వేలాది ఫిదాయీలు(ఆత్మాహుతి దళ సభ్యులు) ఉన్నారంటూ జైష్ బహవల్పూర్ మసీదులో మసూద్ హెచ్చరికలు జారీచేసిన ఆడియో టేపును సీఎన్ఎన్-న్యూస్ 18 సంపాదించింది.
“ముజాహిద్‌కి ఇచ్చే నిధులు జిహాద్‌కు ఉపయోగిస్తాం. పాకిస్థాన్‌కు పెద్ద మత గురువుల ఆశీస్సులు ఎంత కావాలో జిహాదీల ఆశీస్సులు కూడా అంతే కావాలి. మా వద్ద ఫిదాయీలు ఉన్నారు. వారిని ఏ శక్తి కాని క్షిపణి కాని అడ్డుకోలేవు. మాకు 30,000 మంది క్యాడర్ ఉంది. జైష్ వద్ద 10,000 మంది ఫిదాయీలు జిహాద్ కోసం సిద్ధంగా ఉన్నారు” అని ఆ క్యాసెట్లో మసూద్ అజర్ హెచ్చరించడం వినిపించింది.