Giorgia Meloni | ఇరాన్‌తో యుద్ధం.. ఇజ్రాయెల్‌తో రక్షణ ఒప్పందం రద్దు చేసుకున్న ఇటలీ
Giorgia Meloni : ఇరాన్‌తోపాటు లెబనాన్‌పై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌కు ఇటలీ షాకిచ్చింది. ఇజ్రాయెల్‌తో కుదుర్చుకున్న రక్షణ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మంగళవారం దీనిపై ప్రకటన చేశారు.
Giorgia Meloni : ఇరాన్‌తోపాటు లెబనాన్‌పై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌కు ఇటలీ షాకిచ్చింది. ఇజ్రాయెల్‌తో కుదుర్చుకున్న రక్షణ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మంగళవారం దీనిపై ప్రకటన చేశారు. ‘‘ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని ఇజ్రాయెల్‌తో కుదుర్చుకున్న రక్షణ ఒప్పందం పొడిగింపును రద్దు చేసుకుంటూ ఇటలీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది’’ అని జార్జియా మెలోని ప్రకటించారు.
వెరోనాలో జరిగిన ఒక కార్యక్రమంలో జార్జియా ఈ ప్రకటన చేశారు. ఇజ్రాయెల్-ఇటలీ మధ్య రక్షణకు సంబంధించి సైనిక పరికరాలు, సాంకేతిక సహకారం అందించే విషయంలో ఒప్పందం ఉంది. అయితే, ఈ రక్షణ ఒప్పందం ఇప్పటికిప్పుడు రద్దు కాదు. ఒప్పంద కాల పరిమితి ముగిసిన తర్వాత పొడిగింపు జరగాలి. ఈ పొడిగింపునే ఇటలీ రద్దు చేసుకుంటూ నిర్ణయం తీసుకుంది. ఈ ఒప్పందాన్ని మళ్లీ కొనసాగించాలంటే అప్పటి పరిస్తితుల్ని బట్టి ఇటలీ ప్రభుత్వం సమీక్షించి నిర్ణయం తీసుకుంటుంది. రెండు దేశాల మధ్య 2006లో ఈ ఒప్పందం కుదిరింది. ఇది ప్రతి ఐదేళ్లకోసారి సమీక్షించి పొడిగించుకుంటూ వస్తున్నారు. ఈసారి మాత్రం ఒప్పందాన్ని రద్దు చేసుకోబోతుంది ఇటలీ. ఇరాన్‌తో యుద్ధానికి సంబంధించి ఈ ప్రాంతంలో స్థిరత్వం, శాంతి కోసం అన్నిరకాల సంప్రదింపులు జరపాలని జార్జియా మెలోని కోరుతున్నారు.
హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ప్రయత్నించాలని ఆమె సూచించారు. హార్ముజ్ జలసంధి తమకు కూడా చాలా ముఖ్యమని, చమురుతోపాటు ఎరువుల రవాణాకు కూడా ఎంతో కీలకమని మెలోని వ్యాఖ్యానించారు. ఇరాన్‌తో ఇటీవల అమెరికా జరిపిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో దశ చర్చల కోసం ఇరు దేశాలు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 16న మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉంది. దీనికోసం ఇంకా వేదిక ఖరారు కాలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

