Father murder : ఇల్లినాయిస్లోని షామ్‌బర్గ్‌లో భారత సంతతికి చెందిన వ్యక్తి తన తండ్రిని దారుణంగా హత్య చేశాడు. అభిజిత్ పటేల్ అనే 28 ఏళ్ల వ్యక్తి తన తండ్రి అయిన 67 ఏళ్ల అనుపమ్ పటేల్‌ను సుత్తితో తలపై మోది హతమార్చాడు. థాంక్స్ గివింగ్ వారాంతంలో తండ్రిని చంపిన అభిజిత్ పటేల్‌ను పోలీసులు అరెస్ట్ చేసి ఫస్ట్-డిగ్రీ హత్య కేసు నమోదు చేశారు.
కుక్ కౌంటీ ప్రాసిక్యూటర్ల ప్రకారం బాధితుడు అనుపమ్ పటేల్ డయాబెటిస్తో బాధపడుతున్నకారణంగా ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో నవంబర్ 29న కుమారుడి చేతిలో హత్యకు గురయ్యాడు. అనుపమ్ పటేల్‌కు ప్రతిరోజు ఉదయం 8 గంటల సమయంలో డ్యూటీలో ఉన్న భార్యకు తన షుగర్స్ లెవల్స్ గురించి అప్డేట్ ఇవ్వడం అలవాడు. పైగా అతని గ్లూకోమీటర్ కూడా భార్య ఫోన్‌కు కనెక్ట్ అయి ఉంటుంది.
ఈ క్రమంలో నవంబర్ 29న భర్త నుంచి ఫోన్ రాకపోవడం, గ్లూకోమీటర్‌లో అతడి షుగర్ లెవల్స్ దారుణంగా పడిపోవడాన్ని ఆమె గమనించింది. వెంటనే ఇంటికి పరుగులు తీసి చూడగా భర్త రక్తపు మడుగులో పడివున్నాడు. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా కుమారుడే హత్య చేసినట్లు గుర్తించారు. అతడిని అరెస్ట్ చేశారు. కాగా చిన్నతనంలో తన తండ్రి తనను లైంగికంగా వేధించాడని, అందుకే చంపేశానని, ఇది తన డ్యూటీని అని పోలీసుల విచారణలో చెప్పుకొచ్చాడు.
అయితే స్కిజోఫ్రీనియా బాధితుడైన అభిజిత్ గతంలో చికిత్స తీసుకున్నాడు. ఈ వ్యాధి ఉన్నవాళ్లు లేనిది ఉన్నట్లుగా, జరగనిది జరిగినట్లుగా భ్రమ పడుతుంటారు. ఈ క్రమంలో అభిజిత్ తన తండ్రి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించాడు. చాలాసార్లు తండ్రిని చంపేస్తానని బెదరించాడు. దాంతో 2027 వరకు తండ్రిని కలువకుండా అతడిపై నిషేధం ఉంది. కానీ పేరెంట్స్ అతనిపై ప్రేమతో ఇంట్లో ఉంచుకున్నారు.
ఈ క్రమంలోనే అతడు తండ్రిని దారుణంగా హత్యచేశాడు. దాంతో పోలీసులు అభిజిత్ పటేల్‌పై నాన్ బెయిలబుల్ కేసులు నమోదుచేశారు. ఇక నుంచి అతడు తన తల్లిని కలువకుండా నిషేధం విధించారు. కేసు తదుపరి విచారణ డిసెంబర్ 19కి వాయిదా పడింది.