e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home News పసివాడి ప్రాణాల కోసం పగను పక్కనపెట్టి.. కాపాడేందుకు ముందుకొచ్చిన మహిళ

పసివాడి ప్రాణాల కోసం పగను పక్కనపెట్టి.. కాపాడేందుకు ముందుకొచ్చిన మహిళ

ఈష్‌హ‌ర్‌: పాల‌స్తీనా.. ఇజ్రాయెల్ మ‌ధ్య కొన్ని ద‌శాబ్దాలుగా ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటున్న‌ది.. కానీ ఓ ఇజ్రాయెలీ మ‌హిళ మాన‌వ‌త్వం ప్ర‌ద‌ర్శించారు.. గాజా స్ట్రిప్‌లోని ఓ ప‌సి బాలుడి ప్రాణాలు నిల‌బెట్ట‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఇజ్రాయెలీ ప్రాథ‌మిక పాఠ‌శాల ఉపాధ్యాయురాలు ఇదిత్ హ‌రెల్ సెగ‌ల్ (50) ప్ర‌ద‌ర్శించిన దాతృత్వం అంద‌రి మ‌న్న‌న‌లు పొందుతున్న‌ది.

కిడ్ని డొనేట్ చేయ‌డానికి ఇలా క‌స‌ర‌త్తు

ఆమె త‌న కిడ్నీని డొనేట్ చేసేందుకు ముందుకు వ‌చ్చారు. అందుకోసం డోనర్లు, అవ‌య‌వాల స్వీక‌ర్త‌ల గ్రూప్‌తో కాంటాక్ట్ ఏర్ప‌రుచుకున్నారు. అవ‌స‌ర‌మైన వారికి కిడ్నీ ఇవ్వ‌డానికి ముందుకు వ‌చ్చిన సెగ‌ల్‌.. నిర్ణ‌యం అమ‌లు చేయ‌డానికి తొమ్మిది నెల‌ల టైం ప‌ట్టింది. గాజా స్ట్రిప్‌లోని మూడేండ్ల పాల‌స్తీనా బాబుకు త‌న కిడ్నీ ఇవ్వాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చారు.

గాజా బాలుడికి కిడ్నీ ఇవ్వాల‌ని ఇజ్రాయెలీ టీచ‌ర్‌

- Advertisement -

గాజా బాలుడికి కిడ్నీ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న‌దే త‌డ‌వుగా అత‌డికి లేఖ రాశారు. నీవెవ‌రో నాకు తెలియ‌దు కానీ.. త్వ‌ర‌లో మ‌నం క‌లుస్తాం. ఎందుకంటే నీ శ‌రీరంలో నా కిడ్నీ చేర‌నుంది అని పేర్కొంటూ హిబ్రూలో లేఖ రాశారు. ఈ స‌ర్జ‌రీ విజ‌య‌వంతం అవుతుంద‌ని, నీవు సుదీర్ఘ కాలం ఆరోగ్యంగా, అర్ధ‌వంత‌మైన జీవితం సాగించాల‌ని ఆశాభావంతో ఉన్న‌ట్లు ఆమె పేర్కొన్నారు.

అయితే, రెండు ప్రాంతాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ నేప‌థ్యంలో పేరు బ‌య‌ట‌పెట్టొద్ద‌ని సెగ‌ల్‌ను ఆమె కుటుంబం కోరింది. సస‌ద‌రు బాలుడి కుటుంబం అర్థం చేసుకోవ‌డానికి వీలుగా ఒక ఫ్రెండ్ ఈ లేఖ‌ను అర‌బిక్‌లోని త‌ర్జుమా చేశారు.

దాతృత్వానికి సంకేతంగా సెగ‌ల్‌

ద‌శాబ్దాలుగా రెండు వ‌ర్గాల మ‌ధ్య పెరుగుతున్న శాశ్వ‌త ఘ‌ర్ష‌ణ నేప‌థ్యంలో దాతృత్వానికి ఉదాహ‌ర‌ణ‌గా నిలిచారు సెగ‌ల్‌. రెండో ప్ర‌పంచ యుద్ధం స్రుష్టించిన వినాశ‌నం నుంచి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డిన త‌న తాత జ్ఞాప‌కాల‌ను ఆమె గుర్తు చేసుకున్నారు. అర్థవంత‌మైన జీవితం గ‌డుపాల‌ని, అది యూదుల సంప్ర‌దాయం అని, ప్రాణాలు కాపాడ‌టం కంటే మంచి ప‌ని మ‌రొక‌టి ఉండ‌ద‌ని చెప్పేవార‌న్నారు.

కుటుంబ స‌భ్యులంతా వ్య‌తిరేకించినా..

కానీ త‌న నిర్ణ‌యానికి త‌న కుటుంబం వ్య‌తిరేకంగా ఉన్న‌ది. ప్ర‌తి ఒక్క‌రూ వ్య‌తిరేకించారు. నా భ‌ర్త‌, సోద‌రి- ఆమె భ‌ర్త ప్ర‌తి ఒక్క‌రూ వ్య‌తిరేకించారు. నా తండ్రి మాత్ర‌మే నాకు మ‌ద్ద‌తుగా నిలిచారు. ఏండ్ల త‌ర‌బ‌డి కొన‌సాగుతున్న సంక్షోభం, బ్లాకేడ్ వ‌ల్ల గాజా హెల్త్ కేర్ వ్య‌వ‌స్థ దెబ్బ తిన్న‌ది.

ఈ ప‌రిస్థితుల్లో మాన‌వ‌త్వ కోణంలో తీవ్ర‌మైన అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ట్రీట్‌మెంట్ అవ‌స‌ర‌మైన కొద్ది మందికి త‌మ దేశంలోకి వ‌చ్చేందుకు ఇజ్రాయెల్ ప‌ర్మిట్లు ఇస్తున్న‌ది.

ఇవి కూడా చ‌ద‌వండి:

Bharti Arora | ‘శ్రీకృష్ణుడి సేవ’ కోసం ఐపీఎస్‌కు రాజీనామా..

ఆ జ‌డ్జిది యాక్సిడెంట్ కాదు హ‌త్యే.. వీడియో

Ram charan | రూ.25 ల‌క్ష‌లు గెలుచుకున్న రాంచ‌రణ్

Tokyo Olympics: మ్యాచ్‌కు ముందు ప్లేయ‌ర్‌ను లాగిపెట్టి కొట్టిన కోచ్‌.. షాకింగ్ వీడియో

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement