గాజా: ఇజ్రాయిల్(Israel) తాజాగా జరిపిన దాడుల్లో.. గాజాలో 60 మంది మృతిచెందారు. దీంట్లో చిన్నారులు కూడా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపారు. కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన హమాస్‌పై శక్తివంతమైన దాడి చేయాలని ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యహూ తన మిలిటరీని ఆదేశించారు. మంగళవారం రాత్రి జరిగిన వరుస దాడుల్లో 33 మంది పాలస్తీనియన్లు మృతిచెందినట్లు హమాస్‌కు చెందిన సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ పేర్కొన్నది. అమెరికా నేతృత్వంలో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని హమాస్ ఉల్లంఘించినట్లు ఇజ్రాయిల్ ఆరోపిస్తున్నది. దానికి బదులుగానే దాడులు చేసినట్లు ఆ దేశం పేర్కొన్నది.
దక్షిణ గాజాలో ఇజ్రాయిల్ సైనికుడిని హమాస్ చంపేసినట్లు రక్షణ మంత్రి ఆరోపించారు. మరణించిన బంధీల అప్పగింత విషయంలోనూ హమాస్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. కానీ దాడితో తమకు సంబంధం లేదని హమాస్ పేర్కొన్నది. కాల్పుల విరమణకు కట్టుబడి ఉన్నట్లు చెప్పింది.