టెహ్రాన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆరోగ్యం విషమంగా ఉంది..ఆయన మరణవార్త త్వరలో వెలువడనున్నది..అంటూ ఇజ్రాయెల్ మీడియా సంచలన కథనం వెలువరించింది. శనివారం ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై ఇజ్రాయెల్ మీడియా ‘చానల్-14’, ఇరాన్ వైర్లో సంచలన కథనాలు వెలువడ్డాయి. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ ప్రభుత్వానికి సంబంధించిన సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ ‘ఇరాన్ వైర్’, మొజ్తబా ఆరోగ్యంపై కీలక వివరాలను తెలిపింది. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదని ‘పెజిష్కియాన్’ ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయట. ఆయన మరణవార్త వినాల్సి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని అధికారిక వర్గాలను ఉటంకిస్తూ ‘ఇరాన్ వైర్’ తెలిపింది.