Israel | జెరూసలెం, జూలై 27: కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చించేందుకు ఇజ్రాయెల్-హమాస్ నేతలు సిద్ధమవుతున్న తరుణంలో, శనివారం సెంట్రల్ గాజాపై ఇజ్రాయెల్ భీకరమైన వైమానిక దాడులను చేపట్టింది. పాలస్తీనా ప్రజలు తలదాచుకున్న ఓ స్కూల్ భవనంపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులకు పాల్పడింది.
ఈ దాడుల్లో పలువురు చిన్నారులు సహా మొత్తం 30 మంది చనిపోయారని వార్తలు వెలువడ్డాయి. స్కూల్ భవనాన్ని హమాస్ కమాండర్ స్థావరంగా మలుచుకున్నాడని, అక్కడ పెద్ద మొత్తంలో ఆయుధాగారం ఉందని తెలియటంతో దాడులు చేశామని ఇజ్రాయెల్ మిలటరీ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, కాల్పుల విరమణపై అమెరికా, ఈజిప్ట్, ఖతార్, ఇజ్రాయెల్ దేశాలకు చెందిన అధికారులు ఆదివారం ఇటలీలో సమావేశం కానున్నారు.