డమాస్కస్: గాజాలోని హమాస్‌పై దాడులు తీవ్రం చేసిన ఇజ్రాయెల్ తాజాగా సిరియాపై కూడా గురిపెట్టింది. (Israel Strikes In Syria) గురువారం సిరియాలోని డమాస్కస్, అలెప్పో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులపై క్షిపణులతో దాడులు చేసింది. సిరియా ప్రభుత్వ టీవీ ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈ నేపథ్యంలో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను యాక్టివేట్ చేసినట్టు సిరియా తెలిపింది. అలాగే విమానాల రాకపోకలను రద్దు చేసినట్లు వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఈ రెండు విమానాశ్రయాల్లో విమానాలను గ్రౌండింగ్ చేసినట్టు పేర్కొంది.
కాగా, పొరుగు దేశమైన సిరియాతో కూడా ఇజ్రాయెల్ దశాబ్దాలుగా పోరాడుతున్నది. వందలాది సార్లు ఎయిర్‌స్ట్రైక్స్ చేసింది. ప్రధానంగా ఇరాన్ మద్దతిస్తున్న హిజ్బుల్లా ఫైటర్స్‌తోపాటు సిరియా ఆర్మీని కూడా టార్గెట్ చేసింది. అయితే ఎప్పుడూ కూడా సిరియాపై దాడులను ఇజ్రాయెల్ ధృవీకరించలేదు. తాజాగా గురువారం సిరియాపై ఎయిర్‌స్ట్రైక్స్ చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ గురువారం ఇజ్రాయెల్ సందర్శించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ మద్దతిస్తున్న హమాస్ ఆధిపత్యం ఉన్న గాజాతోపాటు సిరియాపై కూడా ఇజ్రాయెల్ క్షిపణులతో దాడులు చేయడం గమనార్హం.
Israeli Air Force attacked positions near Damascus airport.
The plane, flying from Iran to Syria, was forced to turn around.
According to some reports, the Iranian Regime’s Foreign Minister is scheduled to fly to Syria tomorrow.#Israel pic.twitter.com/WrC6g5K4Mw— Pouria Zeraati (@pouriazeraati) October 12, 2023
🚨‼️ BREAKING: Israel attacked the airports of Damascus and Aleppo in Syria…#IsraelPalestineConflict #Isarael #Israel #FreeGaza #الخرج #غزة_تُباد #طوفان_الاقصى_ #IsraelPalestineWar #Lebanon #Iran #HamasMassacre Israel vs Hamas war… pic.twitter.com/4DIvsY4juH
— Dr Zaid Khan (@zaidlala786) October 12, 2023