శనివారం 06 జూన్ 2020
International - Apr 13, 2020 , 09:17:55

క‌రోనా ల‌క్ష‌ణాల‌తో.. యూదుల మ‌త‌పెద్ద మృతి

క‌రోనా ల‌క్ష‌ణాల‌తో.. యూదుల మ‌త‌పెద్ద మృతి

హైద‌రాబాద్‌: ఇజ్రాయిల్‌లోని యూదుల మ‌త‌పెద్ద, సెఫార్డీ వ‌ర్గానికి చెందిన మాజీ చీఫ్ బ‌క్షీ డోర‌న్ .. కరోనా వైర‌స్ వ‌ల్ల మృతిచెందారు. ఆయ‌న వ‌య‌సు 79 ఏళ్లు.  జెరుస‌లాంలోని షేరే జెడ‌క్ మెడిక‌ల్ సెంట‌ర్‌లో ఆయ‌న తుదిశ్వాస విడిచారు. డోర‌న్ మృతిప‌ట్ల ఇజ్రాయిలీ నేత‌లు సంతాపం తెలిపారు.  దివంగ‌త డోర‌న్ ఓ గొప్ప ఆధ్మాత్మిక గురువు అంటూ కీర్తించారు.  1993 నుంచి 2003 వ‌ర‌కు బ‌క్షీ డోర‌న్ సెపార్డీ చీఫ్‌గా ఉన్నారు. కోవిడ్‌19 ల‌క్ష‌ణాల‌తో హాస్పిట‌ల్‌లో చేరిన అయిదు రోజుల‌కు ఆయ‌న క‌న్నుమూసిన‌ట్లు బంధువులు తెలిపారు. 

డోర‌న్ మృతితో ఇజ్రాయిల్‌లో క‌రోనా వైర‌స్ వ‌ల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 105కు చేరుకున్న‌ది. 1941లో జెరుస‌లాంలో పుట్టిన డోర‌న్‌.. స‌ర్వ‌మ‌తాలు స‌మానం అని చాటారు. మ‌త‌విశ్వాసాల‌పై ఆయ‌న ముస్లింలు, క్రైస్త‌వుల‌తోనూ ప‌లుమార్లు చ‌ర్చ‌లు జ‌రిపారు. 2000 సంవ‌త్స‌రంలో రెండ‌వ పోప్ జాన్ పాల్ ఇజ్రాయిల్ వ‌చ్చిన‌ప్పుడు.. ఆయ‌న్ను డోర‌న్ క‌లిశారు. అప్పుడు ఇజ్రాయిల్ ప్ర‌జ‌లు డోర‌న్‌పై వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేశారు. సాంప్ర‌దాయ యూదులు ఆయ‌న్ను తిర‌స్క‌రించారు.


   

logo