Israel military | ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధానికి (Israel-Iran) తెరపడింది. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ (ceasefire) అమల్లోకి వచ్చింది. దీంతో రెండు దేశాల మధ్య 12 రోజులుగా సాగిన యుద్ధం ముగిసింది. ఈ విషయాన్ని ఇరాన్, ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికా జోక్యంతో ఇరు దేశాలు కాల్పుల విరమణకు వచ్చాయి. అయితే, కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ ఇజ్రాయెల్ తన సైన్యాన్ని (Israel military) అప్రమత్తంగానే ఉంచింది (Israel military on high alert). వైమానికి దళం, సైన్యాన్ని అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. ఇరాన్ నుంచి సైనిక ముప్పు (Iranian threat) పొంచి ఉన్న నేపథ్యంలో దేశ వైమానిక దళం, సైన్యం అప్రమత్తత కొనసాగుతుందని ఇజ్రాయెల్ రక్షణ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కాల్పుల విమరణ ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కూడా స్పందించారు. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య తక్షణమే కాల్పుల విరమణ అమలులోకి వచ్చినట్లు తెలిపారు. దీన్ని ఎవరూ అతిక్రమించరాదు అని ఆయన కోరారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో పోస్టు పెట్టారు. మరోవైపు ఇరాన్‌తో ద్వైపాక్షిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు (Benjamin Netanyahu) తెలిపారు. ఒకవేళ ఎటువంటి అతిక్రమణ జరిగినా.. అప్పుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతామన్నారు. ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ సైట్లపై అమెరికా దాడి చేసిన తర్వాత.. ఇరు దేశాల మధ్య కాల్పుల విమరణ డీల్ కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అయితే అమెరికా చేసిన ప్రతిపాదనను అంగీకరిస్తున్నట్లు ఇజ్రాయెల్ పేర్కొన్నది. ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం దీనిపై ప్రకటన చేసింది.
Also Read..
Netanyahu | కాల్పుల విరమణ మాకు ఒకే.. థ్యాంక్యూ ట్రంప్ : నెతన్యాహు
Doha mall | ఇరాన్ దాడులతో దోహాలో పేలుడు శబ్దాలు.. మాల్ నుంచి పరుగులు తీసిన జనం.. VIDEOS
JD Vance | భవిష్యత్తులో అలా చేయాలనుకుంటే.. కాల్పుల విరమణ వేళ ఇరాన్‌కు జేడీ వాన్స్ కీలక హెచ్చరిక