Israel | హమాస్, ఇజ్రాయెల్ మధ్య కొద్ది నెలలుగా యుద్ధం కొనసాగుతున్నది. యుద్ధాన్ని ఆపేందుకు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. తాజాగా షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. హమాస్ లక్ష్యంగా దాడులు చేసేందుకు ఇజ్రాయెల్ ఆర్మీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయం తీసుకుంటుందని ఓ నివేదిక వెల్లడించింది. ఈ ఏఐ ఆధారిత టూల్‌ని ‘లావెండర్’ పేరుతో పిలుస్తారు. ఏఐ టూల్‌తో పదిశాతం తప్పు జరిగిందని నివేదిక పేర్కొంది. దీనిపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF)ని స్పందించగా.. ఏఐ టూల్ ఉనికి ఖండించలేదు.
అయితే, అనుమానిత ఉగ్రవాదులను గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగిస్తున్నట్లు పేర్కొంది. టూల్ రబ్బర్ స్టాంప్‌లా పని చేసిందని ఓ అధికారి పేర్కొన్నారు. టూల్ ఎవరైనా వ్యక్తిని గుర్తిస్తే 20 సెకన్లలో దాడి చేస్తుందని సమాచారం. ఈ టూల్ ఉగ్రవాదులను గుర్తించే ప్రక్రియలో సమాచార వ్యవస్థ మాత్రమేనని ఆర్మీ ఒక ప్రకటనలో పేర్కొంది. యుద్ధ సమయంలో పౌరులకు నష్టం జరిగేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. నిబంధనలను పరిగణనలోకి తీసుకుని విశ్లేషకులు స్వతంత్ర దర్యాప్తు జరపాలని సైన్యం సూచిస్తున్నది.
ఇజ్రాయెల్ సైనిక చర్యపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఈ నివేదిక వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన లక్షిత వైమానిక దాడుల్లో పాలస్తీనియన్లకు ఆహారాన్ని సరఫరా చేస్తున్న అనేక విదేశీ సహాయ కార్యకర్తలపై దాడి చేసిన చంపినట్లు ఆరోపణలున్నాయి. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. యుద్ధంలో గాజాలో ఇప్పటివరకు 32,916 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం నేపథ్యంలో ఉత్తర గాజాలు నాలిగింట మూడొంతుల మంది ఆకలితో అలమటిస్తున్నారని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది.