జెరూసలేం: మృతదేహాలను పీక్కు తినే పక్షులను సైతం సైనిక కార్యకలాపాలకు వినియోగిస్తున్నది ఇజ్రాయెల్. హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై జరిపిన దాడిలో వేలాది మంది మృతి చెందారు. ఇప్పటికీ చాలామంది మృతదేహాలు లభించడం లేదు.
భద్రతా కారణాల వల్ల వాటిని వెతికించే పరిస్థితులు లేవు. అడవులు, కొండలు లాంటి ప్రదేశాలలో పడి ఉన్న మృతదేహాల ఆచూకీకి గద్దలు, రాబందులను ఇజ్రాయెల్ వినియోగిస్తున్నది.