ఇరాన్ నేవీ చీఫ్ మృతి.. హొర్ముజ్ మూసివేతను పర్యవేక్షిస్తున్నది ఆయనే ఇజ్రాయెల్ ప్రకటన
ఇరాన్ ఎలైట్ నేవల్ ఫోర్స్ కమాండర్ అలీరేజా తంగ్సీరీ దక్షిణ ఇరాన్లో జరిగిన దాడిలో మరణించినట్లు ఇజ్రాయెలీ అధికారి ఒకరు వెల్లడించారు. పశ్చిమాసియాలో యుద్ధం నాలుగవ వారం కొనసాగుతున్న సమయంలో ఇరాన్‌కు చెందిన మరో అత్యున్నత అధికారి మరణించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.
న్యూఢిల్లీ, మార్చి 26 : ఇరాన్ ఎలైట్ నేవల్ ఫోర్స్ కమాండర్ అలీరేజా తంగ్సీరీ దక్షిణ ఇరాన్లో జరిగిన దాడిలో మరణించినట్లు ఇజ్రాయెలీ అధికారి ఒకరు వెల్లడించారు. పశ్చిమాసియాలో యుద్ధం నాలుగవ వారం కొనసాగుతున్న సమయంలో ఇరాన్‌కు చెందిన మరో అత్యున్నత అధికారి మరణించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్‌కు చెందిన అత్యంత శక్తివంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డు కోర్(ఐఆర్జీసీ)లో భాగమైన నౌకాదళానికి సారథ్యం వహిస్తున్న తంగ్సీరీ బంద్ అబ్బాస్‌లో జరిగిన వైమానిక దాడిలో మరణించినట్లు ఇజ్రాయెల్ అధికారి తెలిపారు.
హొర్ముజ్ జలసంధి మూసివేతను పర్యవేక్షించే బాధ్యతను కమాండర్ తంగ్సీరీ నిర్వహిస్తున్నట్లు ఆ అధికారి చెప్పారు. అయితే ఈ వార్తను ఇరాన్ ఇప్పటివరకు ధృవీకరించలేదు. ఇజ్రాయెలీ రక్షణ దళాలు కూడా దాడిపై స్పందించలేదు. ఈ వార్తలను ఇరాన్ ధృవీకరిస్తే అది ఆ దేశ సైనిక నాయకత్వానికి, ముఖ్యంగా వ్యూహాత్మకంగా కీలకమైన పర్షియన్ గల్ఫ్‌లోని దాని నావికా కార్యకలాపాలకు గట్టి దెబ్బ అవుతుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

