న్యూఢిల్లీ: ప్రస్తుతం ఇజ్రాయెల్‌తో సాగుతున్న ఘర్షణలలో ఇరాన్‌కు అండగా ఉంటామంటూ హిజ్బొల్లా చేసిన ప్రకటనను ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ శుక్రవారం తీవ్రంగా వ్యతిరేకించారు. తమ దేశాన్ని బెదిరిస్తున్న ఉగ్రవాదుల పట్ల సహనం కోల్పోయామని, వారికి తగిన విధంగా బుద్ధి చెబుతామని ఆయన తెలిపారు.
హిజ్బొల్లా ప్రధాన కార్యదర్శి తన పూర్వ నాయకుల నుంచి గుణపాఠం నేర్చుకోవడం లేదని, ఇరాన్ నియంత ఆదేశాల మేరకు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా హెచ్చరికలు చేస్తున్నారని ఎక్స్ వేదికగా కట్జ్ పేర్కొన్నారు. తనను హెచ్చరించే ఉగ్రవాదుల పట్ల ఇజ్రాయెల్‌కి సహనం నశించిందని, హిజ్బొల్లా చీఫ్ అర్థం చేసుకుని జాగ్రత్తగా ఉండాలని, ఉగ్రవాదం ఉన్నపక్షంలో ఇక హిజ్బొల్లా ఉండబోదని ఆయన హెచ్చరించారు.