టెహ్రాన్: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం (Israel Iran War) తీవ్రరూపం దాల్చింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులకు ప్రతీకారంగా ఇరాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నది. ఇరు దేశాల మధ్య ఆదివారం తెల్లవారుజామున భీకర దాడులు చోటుచేసుకున్నాయి. ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంతోపాటు ఎస్పీఎన్డీ అణు ప్రాజెక్టుపై ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) దాడులు చేశాయి. టెహ్రాన్‌లోని ప్రభుత్వ అణ్వాయుధ ప్రాజెక్టుకు సంబంధించిన లక్ష్యాలపై విస్తృతమైన దాడులను పూర్తి చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. వాటిలో ఇరాన్ దాచిపెట్టిన అణు ఆర్కైవ్ ప్రదేశం కూడా ఉందని, కీలక అణు శాస్త్రవేత్తలు, అధికారులు చనిపోయినట్లు తెలిపింది.
⭕️ The IDF completed an extensive series of strikes on targets in Tehran related to the Iranian regime’s nuclear weapons project.
The targets included the Iranian Ministry of Defense headquarters, the headquarters of the SPND nuclear project, and additional targets, which…
— Israel Defense Forces (@IDF) June 14, 2025
కాగా, టెహ్రాన్‌లోని షహ్రాన్ చమురు డిపోను ఐడీఎఫ్ లక్ష్యంగా చేసుకున్నదని ఇరాన్ తెలిపింది. తాజాగా హౌసింగ్ కాంప్లెక్స్‌పై జరిపిన వైమానిక దాడుల్లో 29 మంది చిన్నారులు సహా 60 మంది మరణించారని అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు 78 మంది మృతిచెందారని, 320 మంది గాయపడ్డారని పేర్కొన్నారు.
అయితే ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ సమర్థవంతంగా తిప్పికొడుతున్నది. క్షిపణులు, డ్రోన్లతో ఆ దేశంపై విరుచుకుపడుతున్నది. దీంతో జెరూసలేం, టెల్ అవీవ్‌లో అంతటా వైమానిక దాడి సైరన్లు మోగాయి. ఇజ్రాయెల్ ఇంధన మౌలిక సదుపాయాలను, ఫైటర్ జెట్ ఇంధన ఉత్పత్తికి సౌకర్యాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ సైన్యం తెలిపింది. కాగా, ఇరాన్ దాడుల్లో నలుగురు చనిపోయినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు.