Antonio Guterres | టెల్ అవీవ్: ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తున్నట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. తమ దేశంపై ఇరాన్ జరిపిన క్షిపణుల దాడిని నిర్దంద్వంగా ఖండించడంలో గుటెరస్ విఫలమయ్యారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ బుధవారం పేర్కొన్నారు.
ఇరాన్ దాడిని ఖండించలేని ఎవరికీ ఇజ్రాయెల్ నేలపై కాలు పెట్టే అర్హత లేదని కట్జ్ పేర్కొన్నారు.