Israel-Hamas War | ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కొనసాగనున్నది. గాజాలోని హమాస్ స్థావరాలపై లక్ష్యంగా చేసుకొని దాడులు జరుపుతున్నది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ ఒకేసారి ఐదువేల రాకెట్లతో దాడులకు దిగిన తర్వాత భీకర యుద్ధం మొదలైంది. గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి అల్ షిఫా ఆసుపత్రి కేంద్రంగా హమాస్ జరుపుతున్న కార్యకలాపాలపై ఇజ్రాయెల్ ఖండించింది. పట్టుబడిన సైనికుడిని హమాస్ చంపడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే, ఇటీవల డిఫెన్స్ ఫోర్స్ అల్ షిఫా హాస్పిటల్‌తో పాటు కిండర్ గార్టెన్లలో పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నది.
ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇజ్రాయెల్ ఆర్మీ సోషల్ మీడియాలో విడుదల చేసింది. అయితే, అక్టోబర్ 7 తర్వాత గాజాలో అనేక మంది ఇజ్రాయెల్ సైనికులు కిడ్నాప్‌కు గురయ్యారని, దీనిపై సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు ఐడీఎఫ్ పేర్కొంది. కిడ్నాప్‌కు గురైన వారిలో నోహ్ మార్సియానో అనే 19 ఏళ్ల ఇజ్రాయెల్ సైనికుడు ఉన్నాడని పేర్కొంది. అయితే, నోహ్ మృతదేహాన్ని అల్ షిఫా ఆసుపత్రిలో స్వాధీనం చేసుకున్నది. అయితే, నోహ్ ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించినట్లు హమాస్ ప్రకటించింది.
ఫోరెన్సిక్ దర్యాప్తులో అనేక దాడులకు గురైన తేలిందని సైన్యం పేర్కొంది. నోహ్ను హమాస్ తీవ్రవాదులు షిఫా ఆసుపత్రిలో హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రధాన ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి తెలిపారు. అయితే, తాజాగా ఇజ్రాయెల్ అల్ షిఫా ఆసుపత్రిలో 55 మీటర్ల పొడవున్న సొరంగాన్ని గుర్తించినట్లు డిఫెన్స్ ఫోర్స్ పేర్కొంది. గాజాలో సొరంగాలు, బంకర్ల పెద్ద నెట్వర్క్ ఉందని ఇజ్రాయెల్ ఆరోపించింది. దీన్ని హమాస్ ఖండించింది. సొరంగంపై ఇజ్రాయెల్ సైన్యం చేసిన ప్రకటన పూర్తిగా అబద్ధమని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్ మునీర్ ఎల్ బార్స్ పేర్కొన్నారు. ఎనిమిది రోజులుగా ఆసుపత్రిలోనే ఉన్నానని, అలాంటిదేమీ కనిపించలేదన్నారు.
OPERATIONAL UPDATE: IDF and ISA forces revealed a significant 55-meter-long terrorist tunnel, 10 meters underneath the Shifa Hospital complex during an intelligence-based operation.
The tunnel entrance contains various defense mechanisms, such as a blast-proof door and a firing… pic.twitter.com/tU4J6BD4ZG
— Israel Defense Forces (@IDF) November 19, 2023