అమరావతి : ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం గురువారం ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను, కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి ( Minister Parthasarathy ) మీడియా సమావేశంలో వెల్లడించారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టులపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు.
సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని అని జగన్ వ్యాఖ్యనించడాన్ని తప్పుబట్టారు. ఐదేండ్ల పాటు ఏపీకి రాజధాని లేకుండా చేసిన ఆయనకు మాట్లాడే అర్హత లేదని తెలిపారు. ఇంకా అమరావతి మీద విషం చిమ్మడం అనేది సరైనది కాదని అన్నారు. ఎంఎస్ఎంఈ సూక్ష్మ,మధ్య తరహ ఎంటర్ప్రైనర్లో పార్కుల ఏర్పాటకు అవసరమయ్యే రూ.250 కోట్ల మంజూరుకు కేబినేట్ ఆమోదం తెలిపిందన్నారు.