హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. గురవారం ఉదయం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత శేరిలింగంపల్లి నియోజవర్గంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు.
కేటీఆర్ వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణభవన్‌లో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే అరికపూడి గాంధీ పోతే పోయిండని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చాకుల్లాంటి కుర్రాళ్లను కార్పొరేటర్లను నిలబెడుతానని, వారందరినీ గెలిపించాలని కోరారు.
అరికపూడి గాంధీ ప్రభుత్వ బెదిరింపులకు లొంగి తన భూములను కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ సంకల చేరిండని కేటీఆర్ విమర్శించారు. కేటీఆర్ బీఆర్ఎస్లో చేరిన పలువురికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు..
Live: శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరికలు.
📍 తెలంగాణ భవన్. హైదరాబాద్ https://t.co/N4oynizyEE
— BRS Party (@BRSparty) January 8, 2026