Gaza Ceasefire Deal | హమస్-గాజా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలును నిరసిస్తూ ఇజ్రాయెల్ జాతీయ భద్రతా వ్యవహారాల శాఖ మంత్రి ఇతామార్ బెన్ గ్విర్ క్యాబినెట్ నుంచి వైదొలిగారు. బెన్ గ్విర్, బెజాలెల్ స్మూట్రిచ్ సహా ఎనిమిది మంది మంత్రులు వ్యతిరేకించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ.. ‘గాజా-హమాస్’ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి ఆమోదం తెలిపారు. ఒప్పందానికి ఆమోదం తెలిపిన వెంటనే క్యాబినెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ఇతామార్ బెన్ గ్విర్ తెలిపారు.
ఆదివారం నుంచి ఈ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. గాజాలోని జైళ్లలో మగ్గుతున్న హమాస్, పాలస్తీనా ఖైదీలను దశల వారీగా ఇజ్రాయెల్ విడుదల చేయనున్నది. 2023 అక్టోబర్ ఏడో తేదీ నుంచి పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య జరిగిన యుద్ధ కాండలో కనీసం 46,876 మంది మరణించారు. మరో 1,10,642 మంది గాయపడ్డారు. హమాస్- గాజా కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడంతో పలు అంతర్జాతీయ సంస్థలు గాజాలో పని చేసేందుకు సిద్ధం అయ్యారు.