గాజా: కీలకమైన గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ ఆదివారం నుంచి తన బలగాల ఉపసంహరణను ప్రారంభించింది. యుద్ధ సమయంలో మిలిటరీ జోన్‌గా వినియోగించిన నెత్జారిమ్ నడవా నుంచి తన బలగాలను ఉసంహరించడానికి ఇజ్రాయెల్ అంగీకరించింది. కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్న అనంతరం వేలాది మంది పాలస్తీనావాసులు నెత్జారిమ్ ప్రాంతం నుంచి కాలినడకన, వాహనాల ద్వారా తమ ఇళ్లకు చేరుకోవడానికి ఇజ్రాయెల్ సైన్యం అంగీకరించింది.
తాజాగా ఆదివారం ఇజ్రాయెల్ తన బలగాలను ఉపసంహరించడంతో కాల్పుల విరమణకు సంబంధించి రెండో విడత ఒప్పందంపై పురోగతి సాధించినట్టు కన్పిస్తుంది. ఇదే కనుక వాస్తవ రూపం దాల్చితే హమాస్ చేతిలో ఉన్న మరికొందరు బందీల విడుదలకు మార్గం సుగమమవుతుంది.