Israel attacks | ఇరాన్‌లోని మషహర్ పెట్రోకెమికల్పై ఇజ్రాయెల్ దాడి
Israel attacks | ఇరాన్‌లోని నైరుతి ఖుజెస్తాన్ ప్రావిన్స్‌లో గల మషహర్ (Mahshahr) పెట్రోకెమికల్ సముదాయంపై ఇజ్రాయెల్ వైమానిక దళం (IDF) లక్షిత దాడులు నిర్వహించింది.
హైదరాబాద్ : ఇరాన్‌లోని నైరుతి ఖుజెస్తాన్ ప్రావిన్స్‌లో గల మషహర్ (Mahshahr) పెట్రోకెమికల్ సముదాయంపై ఇజ్రాయెల్ వైమానిక దళం (IDF) లక్షిత దాడులు నిర్వహించింది. ఇరాన్ వైపు నుంచి జరిగిన క్షిపణి దాడులకు ప్రతీకారంగా ఈ దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ సైన్యం సోమవారం తెలిపింది. ఇజ్రాయెల్ వైమానిక దళం నైరుతి ఇరాన్‌లోని మహ్షహర్లో ఉన్న పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లోని పలు లక్ష్యాలపై దాడి చేసింది అని సైన్యం పేర్కొంది. అంతకుముందు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును మరిన్ని దాడులకు దూరంగా ఉండాలని చెప్పినప్పటికి, సోమవారం పశ్చిమ, మధ్య ఇరాన్‌లోని సైనిక లక్ష్యాలపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది.
ఏప్రిల్ 8న కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత ఇరాన్‌లోని ఒక ఇంధన కేంద్రంపై జరిగిన తొలి దాడి ఇదే కావడం గమనార్హం. ఈ దాడుల్లో పెట్రోకెమికల్ ప్లాంట్‌లోని కొన్ని భాగాలు దెబ్బతిన్నాయని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఇరాన్‌కు చందిన ప్రాంతీయ అధికారి తెలిపారు. కాగా, శాంతి చర్చలు కొనసాగుతున్న సమయంలో మళ్లీ దాడులు చోటు చేసుకుండటం అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు ప్రమాదంలో పడ్డాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- America
- iran
- Israel attacks
- Mashahr
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

