వాషింగ్టన్, జూలై 2: అమెరికాలో హిందూ ఆలయాలపై విద్వేషపూరిత దాడులకు అడ్డుకట్ట పడటం లేదు. ఉటా రాష్ట్రంలోని ప్రఖ్యాత ‘ఇస్కాన్’ ఆలయంపై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. స్పానిష్ ఫోర్క్లోని ‘ఇస్కాన్ శ్రీ శ్రీ రాధాకృష్ణ’ ఆలయం భవనంపై కొద్ది రోజులుగా దుండగులు విద్వేషపూరిత దాడులకు తెగబడుతున్నారని, భక్తులు, అతిథులు ఆలయం లోపల ఉండగా రాత్రి సమయంలో 20 నుంచి 30 బుల్లెట్ల వరకు కాల్పులు జరిపినట్టు స్థానిక మీడియాలో వార్తా కథనాలు వెలువడ్డాయి. ఈ దాడిని భారత కాన్సులేట్ ఖండించింది.