టెల్ అవీవ్ : సైన్స్ ఫిక్షన్ స్టార్ వార్స్ ప్రేరణతో ఇజ్రాయెల్ కొత్త తరం ఐరన్ బీమ్‌ను అభివృద్ధి చేసింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి సమర్థ, యుద్ధంలో పరీక్షించిన అత్యున్నత శక్తిమంతమైన లేజర్ ఇంటర్సెప్షన్ వ్యవస్థ. ఇది కొత్త తరం ఆయుధాలతో సైనిక రక్షణ వ్యవస్థలో విప్లవం. రాఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇటీవల ఐరన్బీమ్ లేజర్ సిస్టమ్‌ను అధికారికంగా ఆవిష్కరించింది.
సంప్రదాయ మిసైల్ ఇంటర్సెప్టర్లు ఒకసారి రాకెట్‌ను అడ్డుకోవాలంటే దాదాపు 60,000 డాలర్లు ఖర్చవుతుంది. ఈ కొత్త ఐరన్ బీమ్ లేజర్ టెక్నాలజీ శత్రు రాకెట్, యూఏవీ, మోర్టార్లను అడ్డుకోవాలంటే, ఒక షాట్‌కు 2 డాలర్ల విద్యుత్తు ఖర్చవుతుంది. ఇజ్రాయెల్ మాజీ ప్రధాని నఫ్తలి బెన్నెట్ మాట్లాడుతూ, ప్రొజక్టైల్ను గమనించిన క్షణంలోనే ఈ ఐరన్ బీమ్‌తో దెబ్బతీస్తామని, కాలయాపన జరగదని చెప్పారు.