హైదరాబాద్ : పాకిస్థాన్‌లో జరగాల్సిన కాల్పుల విరమణ చర్చలు కార్యరూపం దాల్చడంలో విఫలమైన నేపథ్యంలో ఇరాన్ హార్మూజ్‌లో జలసంధిలో కంటైనర్ నౌకపై ఐఆర్జీసీ కాల్పులు జరిపి పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. పదేపదే ఇచ్చిన హెచ్చరికలను పట్టించుకోక పోవడం వల్లే కంటైనర్ నౌకపై ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కాల్పులు జరిపినట్లు ఇరాన్ ప్రభుత్వ అనుబంధ మీడియా తస్నిమ్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెహ్రాన్‌తో కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు ప్రకటించిన కొన్ని గంటలకే బుధవారం ఉదయం 7:55 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోవడం విశేషం. కాగా, నౌక దెబ్బతిన్నదని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని బ్రిటీష్ సైన్యానికి చెందిన యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.