టెహ్రాన్: ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా బాంబు దాడులతో విరుచుకుపడిన వేళ ఇరాన్ చీఫ్ ఖమేనీ ఎక్కడ ఉన్నారన్న ప్రశ్న అందరిలో తలెత్తుతున్నది. అయితే ఆయన అత్యంత సురక్షితమైన ఒక అండర్‌గ్రౌండ్ బంకర్లో ఉన్నారని, ఆయనపై దాడి జరిగేందుకు అవకాశాలున్నందున ఆయన ఉంటున్న ప్రాంతం ఎలాంటి సిగ్నళ్లకు అందకుండా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ వ్యవస్థను కూడా నిలిపివేశారని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. అత్యంత సన్నిహిత వ్యక్తు లు కొందరు ఆయనకు ఎప్పటికప్పుడు యుద్ధ సమాచారాన్ని అందజేస్తున్నారు.