టెల్ అవీవ్, జూన్ 19: ఇరాన్ పాలకుల పతనం ఇజ్రాయెల్ లక్ష్యం కానప్పటికీ ఇప్పుడు సంఘర్షణ పర్యవసానంగా అది జరుగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ఇజ్రాయెల్ మీడియాతో ఆయన మాట్లాడుతూ పాలన మార్పు అన్నది ఇరాన్ ప్రజలకు సంబంధించిన విషయమని, అది తమ అజెండా మాత్రం కాదని ఆయన పేర్కొన్నారు.
అయితే ఈ సంఘర్షణతో ఇరాన్లో ప్రస్తుత ప్రభుత్వం పడిపోవడం లేదా కొత్త పాలకులు రావడాన్ని ఇరాన్ ప్రజలు చూస్తారని, దీనికి ప్రత్యామ్నాయం లేదని ఆయన అన్నారు. అందుకే దానిని తాము ఒక లక్ష్యంగా చూడటం లేదని, జరగబోయే పరిణామంగా భావిస్తున్నామని అన్నారు.