దుబాయ్: బహ్రెయిన్, కువైట్‌పై బుధవారం ఇరాన్ దాడులు చేసింది. ఇవాళ కూడా బహ్రెయిన్‌లో మిస్సైల్ అలర్ట్ సైరన్ మోగించారు. ఇరాన్‌పై మంగళవారం అమెరికా దాడులు చేసిన నేపథ్యంలో.. కౌంటర్‌గా ఇరాన్ అటాక్ చేసింది. అలర్ట్ సైరన్ మోగిన వెంటనే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని బహ్రెయిన్ ప్రకటన చేసింది. బహ్రెయిన్‌లో కానీ, కువైట్‌లో కానీ డ్యామేజ్ అయినట్లు ప్రస్తుతం ఎటువంటి సమాచారం లేదు. తాజాగా హోర్ముజ్ జలసంధి(Strait of Hormuz)లో మూడు ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ దాడి చేసింది. ఆ దాడులకు బదులుగా శక్తివంతమైన రీతిలో అమెరికా ప్రతిదాడి చేసింది. సుమారు 80 టార్గెట్లను ధ్వంసం చేశామని, దీంట్లో ఐఆర్‌జీసీకి చెందిన 60 బోట్లు ఉన్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ పేర్కొన్నది.
ఖాసిమ్ దీవి, బందర్ అబ్బాస్, సిరిక్ ప్రాంతాలపై దాడులు జరిగినట్లు ఇరానీ మీడియా తెలిపింది. స్థానిక ప్రజలు గాయపడినట్లు తెలిసింది. అయితే హోర్ముజ్‌లో మూడు ట్యాంకర్లపై దాడికి తామే బాధ్యులమని ఇరాన్ ఇప్పటి వరకు ప్రకటించలేదు. కానీ అమెరికా మాత్రం ఆ దేశంపై అటాక్ చేసింది. బహ్రెయిన్, కువైట్‌లో ఉన్న సుమారు 85 అమెరికా మిలిటరీ కేంద్రాలపై మిస్సైళ్లు, డ్రోన్లతో అటాక్ చేసినట్లు ఇరాన్ పేర్కొన్నది. కువైట్‌లో ఉన్న యూఎస్ నేవీ హెడ్‌క్వార్టర్స్‌తో పాటు ఓ ఎయిర్ బేస్‌పై కూడా దాడి జరిగినట్లు ఐఆర్జీసీ చెప్పింది. 60 బోట్లతో పాటు ఇరానీ మిస్సైల్ లాంచ్ సైట్లు, కమాండ్ సెంటర్లపై దాడి చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ పేర్కొన్నది.