టెహ్రాన్, జూన్ 20: ఇజ్రాయెల్‌తో యుద్ధం నేపథ్యంలో తమ దేశంలో ఉంటున్న భారతీయ విద్యార్థులు, పౌరులను సురక్షితంగా స్వదేశానికి పంపేందుకు ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధం వల్ల మూసి ఉంచిన ఇరాన్ గగనతలాన్ని భారత విమానాల కోసం తెరచి వారిని మన దేశానికి పంపేందుకు నిర్ణయించింది.
ఇరాన్లో చిక్కుకుపోయిన మన విద్యార్థులు, పౌరుల కోసం కేంద్రం ఆపరేషన్ సింధూ ప్రారంభించింది. అందులో భాగంగా సుమారు 1000 మందిని మూడు విమానాల ద్వారా భారత్‌కు తీసుకు వస్తున్నారు. అందులో మొదటి విమానం శుక్రవారం రాత్రి 11.30 గంటలకు ఢిల్లీకి చేరుకుంటుందని అధికారులు చెప్పారు. ఇరాన్ నుంచి రావాలనుకున్న మన వారందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు.