Iran Warning | సముద్ర గర్భంలో తప్ప గల్ఫ్‌లో మీకు చోటు లేదు.. అమెరికాకు ఖమేనీ హెచ్చరిక
Iran Warning | ఇరాన్ సుప్రీం నాయకుడు అయాతొల్లా మొజ్తబా ఖమేనీ అమెరికాను మహా సైతానుగా అభివర్ణిస్తూ గురువారం విమర్శలు గుప్పించారు. ఇరాన్ అణు, క్షిపణి సామర్థ్యంపై రాజీపడే ప్రసక్తి లేదని ఆయన స్పష్టంచేశారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ఇరాన్ సుప్రీం నాయకుడు అయాతొల్లా మొజ్తబా ఖమేనీ అమెరికాను మహా సైతానుగా అభివర్ణిస్తూ గురువారం విమర్శలు గుప్పించారు. ఇరాన్ అణు, క్షిపణి సామర్థ్యంపై రాజీపడే ప్రసక్తి లేదని ఆయన స్పష్టంచేశారు. ఖమేనీ పంపిన లిఖితపూర్వక ప్రకటనను ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్‌లో చదివి వినిపించారు. ఇరాన్‌కు చెందిన వ్యూహాత్మక కార్యక్రమాలపై రాజీపడబోమని, అవి జాతీయ సార్వభౌమత్వానికి కేంద్రంగా ఉంటాయని ఖమేనీ స్పష్టం చేశారు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అమెరికన్లకు స్థానం లేదని ఆయన ప్రకటించారు.
పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్‌కు చెందిన జలాలవ్యాప్తంగా ఉన్న మేము, మా పొరుగువారు ఒక ఉమ్మడి గమ్యాన్ని పంచుకుంటాము. దురాశ, దురుద్దేశంతో వేలాది కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన విదేశీయులకు సముద్రగర్భంలో తప్ప ఎక్కడా స్థానం లేదు అని ఖమేనీ పేర్కొన్నారు. ఇరాన్ సాంకేతిక, సైనిక సామర్థ్యాలు తమ జాతి ఆస్తులుగా ఆయన అభివర్ణించారు. వాటిని తమ ప్రజలే రక్షించుకుంటారని ఆయన చెప్పారు.
త్వరలో కొత్త ఆయుధం
ఇరాన్ తాజా ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించడంతో రెండు దేశాల మధ్య శాంతి చర్చల్లో పురోగతి కుంటుపడిన నేపథ్యంలో తన శత్రువులు తీవ్రంగా భయపడే ఒక కొత్త ఆయుధాన్ని అతి త్వరలో ఆవిష్కరించనున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ నావికాదళ కమాండర్ షహ్రామ్ ఇరానీ గురువారం మాట్లాడుతూ తమ దేశం అతి త్వరలో తమ శత్రువులను వారి పక్కనే ఉన్న ఆయుధంతో ఎదుర్కొంటుందని, వారికి గుండెపోటు రాదని ఆశిస్తున్నాము అని హెచ్చరించారు.
ఇరుపక్షాల మధ్య తీవ్రమవుతున్న వాగ్వాదాలు, కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ తాజా పరిస్థితుల్లో త్వరిత విజయంపై శత్రువుల అంచనాలను ఇరాన్ సైన్యం కొట్టివేసింది. ఇటువంటి అంచనాలు హాస్యాస్పదంగా మారాయని పేర్కొన్నది. మూడు రోజుల నుండి ఒక వారం లోపు సాధ్యమైనంత తక్కువ సమయంలో ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించవచ్చని శత్రువులు భావించారు. వారి ఈ ఊహ ఒక జోక్‌గా మారింది అని నేవీ కమాండర్ అన్నట్లు ఇరాన్ మీడియా పేర్కొన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

