టెహ్రాన్: అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త సైనిక దాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతున్నది. ఈ క్రమంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ తమ పొరుగు దేశాలకు హెచ్చరికలు చేశారు. గల్ఫ్ దేశాల్లో దాడులు ఆగాలన్నా..శాంతి, అభివృద్ధి నెలకొనాలన్నా తాము చెప్పినట్టు వినాలన్నారు.
ఆయా దేశాల గగనతలాలను వినియోగించుకొని శత్రువులు తమపై దాడి చేస్తున్నారని అన్నారు. గగనతలాలను వినియోగించుకోవడానికి అమెరికా, ఇజ్రాయెల్‌లకు అనుమతి ఇవ్వొద్దని గల్ఫ్ దేశాలకు సూచించారు. శత్రు స్థావరాలు భూస్థాపితం అయ్యే వరకు దాడులు కొనసాగిస్తామని అన్నారు.